
దైవభక్తి.. దేశభక్తి
రామారెడ్డి: దక్షిణ కాశీగా పేరుగాంచిన ఇసన్నపల్లి(రామారెడ్డి)లోని శ్రీకాలభైరవ స్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలు కొనసాగుతున్నాయి. వైశాఖ మాసంలో చివరి మంగళవా రం కావడంతో 108 రకాల పువ్వులతో స్వామివారిని అలంకరించారు. ఈ క్రమంలో దైవభక్తి తో పాటు దేశభక్తిని చాటుకున్నారు. మువ్వన్నె ల పువ్వులతో స్వామివారి ముందు అలంకరించారు. అర్చకులు శ్రీనివాస శర్మ, వంశీకృష్ణ శర్మ లు స్వామివారికి పూజలు చేశారు. ఉదయం నుంచి స్వామివారికి జలాభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వా మి వారిని దర్శించుకున్నారు. రామారెడ్డి పోలీసులు బందోబస్తు కల్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చే శారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు గు ప్తా, జూనియర్ అసిస్టెంట్లు లక్ష్మణ్, నాగరాజ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గంజి సతీశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

దైవభక్తి.. దేశభక్తి