
విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
కామారెడ్డి క్రైం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో ప్రధానోపాధ్యాయులు కీలకపాత్ర వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. దేవునిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు నూతన బోధన పద్ధతులపై అవగాహన పెంచుకుంటూ మిగతా ఉపాధ్యాయులను దిశానిర్దేశం చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన విద్యాబోధన చేయాలన్నారు. తల్లిదండులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రాజు, అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, ట్రైనింగ్ సెంటర్ ఇన్‌చార్జి గంగాకిషన్, ఏసీజీఈ బలరాం, పరీక్షల కార్యదర్శి లింగం తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదా రులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 19వ వార్డు సైలా నీబాబా కాలనీలో జరీనా బేగంకు మంజూరైన ఇంటి నిర్మాణానికి మార్కవుట్ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి దశల వారీగా బిల్లులు వ స్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు వనిత, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్