
ఏ రోడ్డు చూసినా..
వర్షాలు కురిసినపుడల్లా పట్టణంలోని ప్రధాన రోడ్లు చెరవులను తలపిస్తుంటాయి. సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, నిజాంసాగర్ రోడ్డు, అశోక్‌నగర్ రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు చేరుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏటా ఈ సమస్య ఎదురవుతూనే ఉంది. అప్పుడప్పుడు బల్దియా ద్వారా నీటిని తోడేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. అలాగే పట్టణంలో పలు కాలనీలలో డ్రెయినేజీలు కబ్జాకు గురయ్యాయి. దీంతో వర్షాకాలంలో వరద నీరు పోయేందుకు దారి లేక నీరంతా రోడ్లపై నిలిచిపోతూ ఇళ్లలోకి చేరుతోంది. వర్షపు నీరు సులువుగా వెళ్లేలా డ్రెయినేజీలు నిర్మించినా చాలాచోట్ల వాటిని ధ్వంసం చేశారు. ఎక్కడికక్కడ కబ్జాకు గురై నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.