కామారెడ్డి క్రైం : ఓ ఇంట్లోకి ప్రవేశించి రెండు సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్ట ణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన గుండ్ల రాజు ఇంట్లో 2016 మే 8న వేకువ జము న చోరీ జరిగింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి రెండు సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు.
సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసిన వ్యక్తిని కామారెడ్డి పట్టణానికి చెందిన సద్దుల శంకర్‌గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అప్పటినుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. నేరం రుజువు కా వడంతో కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి సు ధాకర్ మంగళవారం తీర్పు ఇచ్చారు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమా నా విధించారు. నిందితునికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.
కొనుగోలు కేంద్రాల సందర్శన
కామారెడ్డి క్రైం : వర్షాల తో ఆగమవుతున్న రైత న్న అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. కామారె డ్డి గంజ్‌తో పాటు దేవునిపల్లి, లింగాపూర్, అడ్లూర్, చిన్నమల్లారెడ్డి, గర్గుల్‌లలోని కొనుగోలు కేంద్రాలను డీఎస్‌వో మల్లికార్జున్ బా బు, అధికారులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్‌వో మాట్లాడు తూ ఆయా కేంద్రాలలో నిరంతరంగా కాంటాలు కొనసాగుతున్నాయన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని, టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని తెలిపారు.
‘13,450 యూనిట్లు లక్ష్యం’
నాగిరెడ్డిపేట: రాజీవ్ యువ వికాసం ద్వారా జిల్లాలో 13,450 యూనిట్లు మంజూరు చేయాలన్నది లక్ష్యమని డీఆర్‌డీవో సురేంద ర్ పేర్కొన్నారు. మండల పరిషత్‌ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. బ్యాంకులకు పంపిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చే శారు. నిత్యం బ్యాంకులకు వెళ్లి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఎంపీడీవో ప్రభాకరచారిని ఆదేశించారు. మండల పరిషత్ సిబ్బందికి ఐకేపీ సీసీలు సహకరించేలా చూడాలని ఏపీఎం జగదీశ్‌కు సూచించారు. అనంతరం వివిధ బ్యాంకులకు వెళ్లి రాజీవ్ యువవికాసం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయా లని మేనేజర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి 41,547 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 12,624 దరఖాస్తులను బ్యాంకర్లు పరిశీలించారని పేర్కొన్నారు. మిగతావాటి పరిశీలన ప్రక్రియను రెండురోజుల్లో పూర్తి చేస్తామన్నారు.
కామారెడ్డి ఆర్ట్స్ కళాశాలకు మరో పీజీ కోర్సు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు మరో పీజీ కోర్సు మంజూరయ్యింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ పీజీ కోర్సును ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ తెలిపారు. 60 సీట్లతో పీజీ ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ కోర్సును మంజూరు చేస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. కళాశాలలో మొత్తం 12 పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిగ్రీ దోస్త్ ప్రవేశాలపై సందేహాలుంటే నేరుగా కళాశాలలో గానీ 94416 21456, 91823 04067 నంబర్లలోగాని సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.
పదోన్నతి పొందినవారికి జిల్లాల కేటాయింపు
కామారెడ్డి క్రైం: ఎస్సైలుగా పదోన్నతి పొంది శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎస్సైలకు జిల్లాలను కేటాయిస్తూ ఉన్నతాధికారులు మంగళవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జిల్లాకు చెందిన పదకొండు మంది ఉన్నారు. జిల్లా పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసిన లచ్చీరాం, సిద్దిఖీ, సాదు లింబాద్రి, పి.గణేష్, ఉమేష్, మల్లారెడ్డి, సుబ్రహ్మణ్య చారి, సంజీవ్, నర్సింలు, రాములు, హన్మాగౌడ్‌లను సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు కేటాయించారు.