
అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కామారెడ్డి క్రైం: తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తమ ఆట, పాటల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కళాకారులు అందిస్తున్న సేవలను గుర్తించి బుధవారం తన చాంబర్‌లో శాలువాలతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి కార్యక్రమాలను ప్రజలకు ఆట, పాటల ద్వారా గత నెలలో దాదాపు 15 రోజుల పాటు తెలియజేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ప్రభు త్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి భీమ్ కుమార్, కళాకారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్