అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Apr 12 2025 2:42 AM | Updated on Apr 12 2025 2:42 AM

అంతర్

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

కామారెడ్డి క్రైం : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని జాతీయ రహదారి 44 వెంబడి ఆగి ఉన్న వాహనాలను టార్గెట్‌ చేస్తూ దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా (పార్థి గ్యాంగ్‌)ను కామారెడ్డి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్‌ చంద్ర వివరాలు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో కామారెడ్డి జిల్లా లోని సదాశివనగర్‌, దేవునిపల్లి పీఎస్‌ల పరిధిలో రెండు దారి దోపిడీ ఘటనలు వెలుగు చూశాయి. వాటిలో ఒకటి ఈ నెల 2 న టేక్రియాల్‌ వద్ద జరిగింది. ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కుమారుడిని హైదరాబాద్‌లోని హాస్టల్‌ నుంచి కారులో ఇంటికి తీసుకుని వస్తూ తెల్లవారు జామున టేక్రి యాల్‌ సమీపంలోని దాబా వద్ద రోడ్డు పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. గమనించిన దుండగులు కారు అద్దాలు పగులగొట్టి కత్తులతో బెదిరించి ల్యాప్‌టాప్‌, మరో బ్యాగును ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసి విచారణ జరుపగా ఇలాంటి ఘటనలు ఎన్‌హెచ్‌–44 వెంబడి తరచుగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలతో విచారణ ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

పంక్చర్‌ షాప్‌ యజమాని ఇచ్చిన క్లూతో..

పంక్చర్‌ షాప్‌ యజమాని ఇచ్చిన క్లూతో నిందితులను గుర్తించడం సాధ్యమయిందని ఎస్పీ తెలిపా రు. టేక్రియాల్‌ వద్ద దుకాణం నడుపుతున్న షకీల్‌ పోలీసులకు ఏడాది క్రితం జరిగిన ఓ దారి దోపిడీ ఘటనను వివరించి బాధితుడి అడ్రస్‌ ఇచ్చాడని, అతని ద్వారా నిందితుల ఆనవాళ్లు తెలుసుకున్నామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలతో నిందితులు మెదక్‌ జిల్లాలోని చేగుంట వద్ద ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు వెల్లడించారు. నలుగురు పరారీలో ఉండగా ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలపై విచారణ కొనసాగిస్తామని ఎస్పీ వివరించారు. పంక్చర్‌ షాప్‌ యజమాని షకీల్‌ను అభినందించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐలు శ్రీనివాస్‌, రామన్‌, సంతోష్‌ కుమార్‌, ఎస్సైలు రాజు, రంజిత్‌, ఉస్మాన్‌, సిబ్బంది రవి కిరణ్‌, రవి లను ఎస్పీ అభినందించారు.

బెలూన్లు అమ్ముకునేవారిలా..

ఏడుగురు సభ్యుల మహారాష్ట్రకు

చెందిన పార్థి గ్యాంగ్‌

జాతీయ రహదారిపై దారిదోపిడీలు

అవసరమైతే కత్తులతో దాడులు

నిలిపిన వాహనాలు వీరి టార్గెట్‌

వివరాలు వెల్లడించిన

కామారెడ్డి ఎస్పీ రాజేష్‌ చంద్ర

మహారాష్ట్రలోని వార్దా జిల్లాకు చెందిన కులీ కిషన్‌ పవార్‌, జాకీ గుజ్జు భోంస్లే, హరీష్‌ పవార్‌, అతని భార్య హౌరా పవార్‌, అనురాగ్‌ రత్నప్ప భోంస్లే, అతని భార్య అంచనా భోంస్లే, చూడీలను ప్ర స్తుతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిరంజీవి, గుండా, సాంబ భోంస్లే, బంగారు భోంస్లేలు పరారీలో ఉన్నారు. వీరంతా వార్దా జిల్లాలోని ఓలాంనగర్‌, సముద్రాపూర్‌, శివగ్రాం గ్రామాలకు చెందిన వారు. వారంతా ముఠాగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. జాతీయ రహదారి వెంబడి రోడ్డుకు దగ్గరగా నీలి రంగు గుడారాలు వే సుకుని నివసిస్తారు. ఉదయం నుంచి రాత్రి వర కు బెలూన్‌లు, పూసలు, చిన్న చిన్న వస్తువులు, బొమ్మలు అమ్ముకునే వారిగా నటిస్తూ కాలనీ ల్లో, రోడ్ల వెంబడి తిరుగుతుంటారు. ఎక్కడ చోరీకి అవకాశం ఉంటే అక్కడ చోరీ చేసేందుకు, అడ్డు వస్తే కత్తులతో దాడి చేసేందుకు సైతం వెనుకాడరని ఎస్పీ తెలిపారు. ప్రధానంగా రోడ్డు పక్క న వాహనాలు నిలిపి విశ్రాంతి తీసుకునే వారిని టార్గెట్‌ చేస్తారు. వాహనాల అద్దాలు పగుల గొట్టి, అవసరమైతే కత్తులతో బెదిరించి నగదు, బంగారం, విలువైన వస్తువులు దోచుకుంటారు. ఇలాంటివి జిల్లాలోని గాంధారి, సదాశివనగర్‌ పీఎస్‌ల పరిధిలో ఒకటి చొప్పున, దేవునిపల్లి పీ ఎస్‌ పరిధిలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి, ఆర్మూర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర పీఎస్‌లలో పలు కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ రహదారుల వెంబడి రోడ్ల పక్కన నిలిపే వాహనాల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందినవి ఉంటా యి. తక్కువ మొత్తంలో సొత్తు కోల్పోయిన వారు ఇక్కడి పీఎస్‌లలో కేసులు పెట్టడానికి ముందుకు రారు కాబట్టి పోలీస్‌ స్టేషన్‌ల వరకు రాని దో పిడీలను ఈ గ్యాంగ్‌ మరెన్నో చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ తెలిపారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు1
1/1

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement