దిగుబడి అంతంతే!
జీజీహెచ్‌కు సీటీ స్కానింగ్ సెంటర్ మంజూరు
పంట నూర్పిడి అనంతరం వడ్లను ట్రాక్టర్‌లో నింపుతున్న హార్వెస్టర్
నాగిరెడ్డిపేట : యాసంగి సీజన్‌లో సాగు చేసిన వరి పంట కోతలు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి తక్కువ దిగుబడులు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో యాసంగి సీజన్‌లో 2.61 లక్షల ఎకరాలలో వరి సాగయ్యింది. అయితే జిల్లాలో ని పలు ప్రాంతాలలో పంటను చీడపీడలు ఆ శించాయి. వాటి నివారణకు రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయి నా పంట దెబ్బతినడంతో దిగుబడులు తక్కు వగా వస్తున్నాయి. పంటను మొగి పురుగు, మెడవిరుపు తెగులు ఆశించాయని రైతులు పే ర్కొంటున్నారు. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో సాగు చేసిన వరినుంచి 28 నుంచి 32 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి. కానీ ఈ సారి 12నుంచి 15 క్వింటాళ్లు కూడా రావడం లే దని పలువురు రైతులు పేర్కొంటున్నారు. తెగుళ్లతో గింజ పొల్లుగా మారిందని, వచ్చిన దిగుబడులతో కనీసం పెట్టుబడుల ఖర్చులూ తిరిగివచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి మీదపడ్డట్లే..
ఆరు ఎకరాలను కౌలు కు తీసుకొని వరి వేశా. పంటను మొగిపురుగు, మెడవిరుపు తెగులు ఆ శించాయి. వీటి నివార ణ కోసం వేల రూపాయల మందులు స్ప్రే చేశాను. ప్రస్తుతం పంట ను కోయగా ఎకరాకు 10 క్వింటాళ్ల వడ్లే వచ్చా యి. ఈసారి పెట్టుబడులు మీదపడ్డట్లే.
– సాయిలు, రైతు, లింగంపల్లికలాన్
మూడు ట్రాక్టర్ల వడ్లే..
మూడెకరాల భూమిలో వరి వేశాను. వారం క్రితం పంటను కోయగా మూడు ట్రాక్టర్ల వడ్లే వచ్చాయి. అంటే ఎకరానికి 12 క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. గతేడాది యాసంగిలో ఎకరాకు 26 క్వింటాళ్ల వరకు పండాయి. ఈసారి తెగుళ్లతో నష్టపోయా.
– సతీష్‌గౌడ్, రైతు, లింగంపల్లి కలాన్
తెగుళ్లతో దెబ్బతిన్న పంట
నిరాశలో వరి రైతు
దిగుబడి అంతంతే!
దిగుబడి అంతంతే!


