నేను.. మీ కలెక్టర్‌ను... | - | Sakshi
Sakshi News home page

నేను.. మీ కలెక్టర్‌ను...

Mar 27 2025 1:23 AM | Updated on Mar 27 2025 1:21 AM

‘‘హలో.. నేను మీ కలెక్టర్‌ను.. మీ పేరు, మీ ఊరు, మీ సమస్య చెప్పండి’’ అంటూ ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను ఓపికగా వింటూ, నోట్‌ చేసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం/కామారెడ్డి టౌన్‌

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025

– 8లో u

జిల్లా కేంద్రంలోని భవానీ నగర్‌లో నాలుగేళ్ల క్రితమే మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌లు వేసి, ఇంటింటికీ నల్లా కనెక్షన్‌లు ఇచ్చారు. ఇప్పటికీ చుక్క నీరు రాలేదు.

– ప్రవీణ్‌, సురేష్‌, నాగరాజు,

భవానీనగర్‌, కామారెడ్డి

కలెక్టర్‌ : అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం.

గ్రామానికి చెందిన ఓ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు ప్రభుత్వ బోరును కబ్జా చేసి, అతడి ఇంటి అవసరాలకు వాడుకుంటున్నాడు. దీంతో గ్రామస్తులకు నీళ్లు దొరకడం లేదు.

– మేనూర్‌వాసి, మద్నూర్‌ మండలం

కలెక్టర్‌ : ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు. ఆర్డీవో, తహసీల్దార్‌లతో మాట్లాడి వెంటనే విచారణ జరిపిస్తాం. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

హన్మాజీపేట జీపీ పరిధిలోని కాంతాపూర్‌, షెట్‌పల్లి తండా, హన్మాజీపేట్‌ తండాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం.

– సాయాగౌడ్‌, హన్మాజీపేట్‌, బాన్సువాడ మండలం

కలెక్టర్‌ : సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం.

వారానికోసారి గోదావరి జలాలు వస్తున్నాయి. చెడిపోయిన మోటార్లకు మరమ్మతులు చేయించడం లేదు. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు.

– తిరుపతి రెడ్డి, రామ్మోహన్‌, అశోక్‌నగర్‌ కాలనీ,

శ్రీకాంత్‌, విద్యానగర్‌, కామారెడ్డి

కలెక్టర్‌ : మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాం. క్రమం తప్పకుండా నీరు వచ్చేలా చూస్తాం. ట్యాంకర్లు ఏర్పాటు చేయిస్తాం.

మిషన్‌ భగీరథ నీళ్లు మా గ్రామానికి ఇప్పటి వరకు రాలేదు. నీటిని ఎప్పుడు అందిస్తారు. – రమేశ్‌, కాటేపల్లి తండా,

పెద్దకొడప్‌గల్‌ మండలం

కలెక్టర్‌ : ఎందుకు నీళ్లు రాలేదో విచారణ జరిపిస్తాం. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం.

సమస్య చెప్పండి.. పరిష్కరిస్తాం

‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

సమస్యలను నోట్‌ చేసుకుని,

అధికారులతో సమీక్ష

అన్నింటినీ పరిష్కరించాలని ఆదేశం

జిల్లాలో తాగునీటి సమస్యలపై బుధవారం ‘సాక్షి’ కలెక్టర్‌తో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించింది. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో మురళి, మిషన్‌ భగీరథ(ఇంట్రా) ఈఈ రమేశ్‌, కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ గ్రిడ్‌, ఇంట్రా అధికారులు, పంచాయతీ అధికారులు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి కాల్స్‌ వచ్చాయి. గంట సమయం నిర్దేశించుకోగా కాల్స్‌ వస్తుండడంతో సుమారు గంటన్నరపాటు కార్యక్రమంలో ఉన్నారు. తర్వాత వచ్చిన కాల్స్‌ను కంట్రోల్‌ రూం అధికారులు రిసీవ్‌ చేసుకున్నారు. కలెక్టర్‌ స్వయంగా 45 మంది కాలర్స్‌తో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల్‌ చేసిన వారి పేరు, ఊరు, ఏ రకమైన సమస్య ఉందో అడిగారు. ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ముగిసిన తరువాత కలెక్టర్‌ సంగ్వాన్‌ అధికారులతో సమీక్షించారు. వచ్చిన అన్ని కాల్స్‌కు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కాగా సాయంత్రం వరకే 12 సమస్యలను పరిష్కరించినట్లు మిషన్‌ భగీరథ, మున్సిపల్‌ అధికారులు ‘సాక్షి’తో తెలిపారు. మిగతా సమస్యలనూ పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

మిషన్‌ భగీరథ ద్వారా పైప్‌లైన్‌ వేసినా నీరు రావడం లేదు. పబ్లిక్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా

చేయించండి. – అజయ్‌కుమార్‌, మద్నూర్‌

కలెక్టర్‌: మీ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తా.

గ్రామంలోని ప్రధానమైన రెండు బోర్లు చెడిపోయాయి. వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం.

– రమేశ్‌, లింగంపల్లి, సదాశివనగర్‌ మండలం

కలెక్టర్‌: అధికారులు వచ్చి సమస్యలను తెలుసుకుంటారు. బోర్లకు మరమ్మతులు చేయిస్తాం.

మంచినీటి పథకం ట్యాంకును శుభ్రం చేయడం లేదు.

– బలరాం, నాగిరెడ్డిపేట

కలెక్టర్‌: గ్రామ కార్యదర్శితో మాట్లాడి సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతాం.

మా కాలనీలోని వెంకటేశ్వరాలయం ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది.

– పురుషోత్తం, కోటగల్లి, బాన్సువాడ

కలెక్టర్‌: వార్డు అధికారులు వచ్చి పరిశీలించి సమస్య పరిష్కరిస్తారు.

జిల్లా కేంద్రంలోని గోదాదేవి ఆలయం పక్కన బోరు వేసి వదిలేశారు.

– రమేశ్‌, అశోక్‌నగర్‌, కామారెడ్డి

కలెక్టర్‌: బోరును వాడకంలోకి తీసుకువస్తాం.

కొత్త బీసీ కాలనీలో నీటి సమస్య ఉంది.

– యాదయ్య, రాజంపేట్‌

కలెక్టర్‌: పంచాయతీ అధికారులకు సూచనలు జారీ చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

పీహెచ్‌సీ సమీపంలోని కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది.

– జహీరున్నీసా బేగం,

లింగంపేట

కలెక్టర్‌: తక్షణమే అధికారులను పంపించి వివరాలు తెలుసుకుంటాం. వాటర్‌ ట్యాంకర్లను పంపిస్తాం.

గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పరిష్కరించండి..

– నరేశ్‌, రాంలక్ష్మణ్‌

పల్లి, గాంధారి మండలం

కలెక్టర్‌: పంచాయతీ అధికారులతో సర్వే చేయించి నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం.

న్యూస్‌రీల్‌

గ్రామంలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. పాత బోర్లు పని చేయడం లేదు. కొత్త బోర్లు వేయించాలి.

– రజిత, సోమార్‌పేట్‌, మాచారెడ్డి మండలం

కలెక్టర్‌ : ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయిస్తాం. అవసరమైతే కొత్త బోర్లు వేయిస్తాం.

జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డుకు చెందిన ఓ మాజీ కౌన్సిలర్‌ మున్సిపల్‌ బోరు నుంచి తన ఇంటికి కనెక్షన్‌ తీసుకుని నీటిని మొత్తం ఆయనే వాడుకుంటున్నాడు. కాలనీలో మిగతా వారికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు.

– నాలుగో వార్డువాసి, కామారెడ్డి

కలెక్టర్‌ : మున్సిపల్‌ అధికారుల ద్వారా విచారణ జరిపిస్తాం. ఆ బోరు నుంచి కాలనీలో అందరికీ నీరు అందేలా చూస్తాం.

భవానీపేట్‌ తండాలో ఒకటే బోరు ఉంది. మూడు రోజులకు ఒకసారి మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయి. సమస్యను పరిష్కరించాలి.

– రాము, భవానీపేట్‌ తండా,

పాల్వంచ మండలం

కలెక్టర్‌ : కొత్త బోరు వేయించడానికి ప్రయత్నిస్తాం. నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

నేను.. మీ కలెక్టర్‌ను...1
1/3

నేను.. మీ కలెక్టర్‌ను...

నేను.. మీ కలెక్టర్‌ను...2
2/3

నేను.. మీ కలెక్టర్‌ను...

నేను.. మీ కలెక్టర్‌ను...3
3/3

నేను.. మీ కలెక్టర్‌ను...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement