చిన్నారులకు టీకాలు వేయించాలి
● ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు ప్రత్యేక దృష్టి సారించాలి
● ఇమ్యూనైజేషన్ అధికారి రోహిత్
నిజాంసాగర్(జుక్కల్): పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు తప్పని సరిగా వేయించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రోహిత్‌కుమార్ అన్నారు. శనివారం మహమ్మద్‌నగర్ మండలం గిర్నితండా పల్లెద వా ఖానలో ఇమ్యూనైజేషన్ కేంద్రాన్ని ఆయ న పరిశీలించారు. నెలనెలా చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పని సరిగా వేయాల న్నారు. చిన్నారుల ఇమ్యూనైజేషన్ ని ర్వహణపై ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట పల్లెదవాఖాన వైద్యుడు తానాజీ, వై ద్యసిబ్బంది మదుసూధన్, వెంకటరమణ, ఆరో గ్య కార్యకర్త సుజాత తదితరులు ఉన్నారు.


