సీఎంతో ఎమ్మెల్యే భేటీ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నియోజకవర్గ అభివృద్ధిపై చ ర్చించేందుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు శనివారం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ఆయన సీఎంతో చర్చించారు. కాళేశ్వరం 22వ ప్యా కేజీ కింద నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కోరా రు. అలాగే వరదల కారణంగా కేకేవై రోడ్డుపై దెబ్బతిన్న హై లెవల్ వంతెల నిర్మాణానికి, గాంధారి, తాడ్వాయి మండలాల్లో మినీస్టేడియంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.
సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాగిరెడ్డిపేట మండలం పోచారంప్రాజెక్టుతోపాటు లింగంపేట మండలం నాగన్నబావి వద్ద పర్యాటక అభివృద్ధి కోసం రూ.5 కోట్లు, నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద శివారు లో 20వేల మెట్రిక్‌టన్నుల గోదాం నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేయడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు నాగిరెడ్డిపేట మండలంలోని మంజీరనదిలో అడవుల క్లియరెన్స్ కోసం రూ.2 కోట్లు, మండలంలోని తాండూర్ సమీపంలోని త్రిలింగరామేశ్వరాలయ పునరుద్ధరణకు రూ.77లక్షల నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.


