రేపు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక
కామారెడ్డి అర్బన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను సోమ వారం నిర్వహించనున్నట్లు ఎస్‌ఈ రవీందర్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కామారెడ్డి హౌసింగ్‌బోర్డు కాలనీ ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న పట్టణ మూడో సెక్షన్ కార్యాలయంలో వేదిక కొనసాగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణం, రూరల్, తాడ్వాయి సెక్షన్‌ల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
దరఖాస్తులకు ఆహ్వానం
కామారెడ్డి అర్బన్ : బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర ప్ర భుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి నుంచి శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి పి వెంకటేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో (2025– 26) శిక్షణ ఉంటుందని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారు అర్హులని, ప్రవేశ పరీక్ష ద్వారా వంద మందికి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
రామారెడ్డి/పిట్లం : రామారెడ్డి మండలం పోసానిపేట, పిట్లం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల వి ద్యార్థులు పల్ల రుచిత, మధు రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికై నట్లు పీఈటీలు నరేశ్‌రెడ్డి, సంజీవులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పా ల్గొంటారన్నారు. రుచితను గ్రామ సర్పంచ్ సుద్దాల లింగం, హెచ్‌ఎం శ్రీనివాస్, ఉప సర్పంచ్ గండ్ర అంజయ్య వీడీసీ చైర్మన్ సా యిలు, మధును సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, సీనియర్ క్రీడాకారులు, గ్రామస్తులు అభినందించారు.
భిక్కనూరు: కాలుష్యం వెదజల్లె ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వొద్దని భి క్కనూరు గ్రామపంచాయతీ పాలకవర్గం తీ ర్మానించింది. సర్పంచ్ బల్యాల రేఖసుదర్శ న్ అధ్యక్షతన శనివారం సమావేశమైన గ్రా మపంచాయతీ పాలకవర్గ సభ్యులు కాలు ష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలతోపాటు ఇతర కంపెనీలకు కూడా ప్రభుత్వం అను మతి ఇవ్వొద్దని, పాత అనుమతులను పునఃపరిశీలించాలని తీర్మానించారు. తీర్మా న ప్రతిని కలెక్టర్‌కు పంపించాలని నిర్ణయించారు. ఉప సర్పంచ్ దుంపల మోహన్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రేపు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక
రేపు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక


