బాల్కొండ: ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన రైతు అమ్మక్కపేట్ కిషన్ మక్కల లోడ్‌తో ట్రాక్టర్‌ను చేనులో నుంచి కల్లాం వద్దకు తీసుకొస్తుండగా మార్గమధ్యలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రైతుకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మక్కలు వరి పొలంలో పడటంతో నీటిపాలయ్యాయి. పొక్లెయిన్ సహాయంతో ట్రాక్టర్‌ను పంట పొలాల నుంచి బయటకు తీశారు.
ఇసుక టిప్పర్, పొక్లెయిన్ సీజ్
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండలం దేగాం గ్రామ శివారులోని వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించగా పొక్లెయిన్‌తోపాటు టిప్పర్‌ను సీజ్ చేశామన్నారు. అలాగే ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు.
మక్కల ట్రాక్టర్ బోల్తా