ధర్మాసుపత్రిలో ఎలుకల గోల | Sakshi
Sakshi News home page

ధర్మాసుపత్రిలో ఎలుకల గోల

Published Mon, Feb 12 2024 1:18 AM

Rats Bite Patient In Kamareddy Govt Hospital - Sakshi

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఎలుకలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆస్పత్రిలో సంచరిస్తూ రోగు లు, వైద్య సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నా యి. ఆస్పత్రి నిర్వహణను అధికారులు, సానిటేషన్‌ కాంట్రాక్టర్‌ పట్టించుకోవడం లేదని, దీంతో తరచూ ఎలుక కాటు సంఘటనలు చోటు చేసుకుంటున్నా యని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి లో శనివారం చోటుచేసుకున్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. ఈ ఘటనలో  ఐసీయూ విభాగంలో ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు.

ఎలుక కొరుకుడు ఘటనలు..
నాలుగేళ్ల క్రితం మార్చురి గదిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. నోరు, ముక్కు, చెవులు, చేతివేళ్లు, కాళ్లను ఎలుకలు పీక్కు తిన్నాయి. ఈ అంశంపై అప్పట్లో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

2022 ఏప్రిల్‌ 11వ తేదీన జిల్లా ఆస్పత్రిలోని ట్రా మాకేర్‌, ఐసీయూ విభాగాలలో చికిత్స పొందుతు న్న రోగులను ఎలుకలు గాయపరిచాయి. ఈ విషయాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తాజా గా ఇదే ఆస్పత్రిలో మళ్లీ శనివారం రాత్రి రోగులను ఎలుకలు కరిచాయి. హౌసింగ్‌బోర్డు కాలనీకి చెంది న షేక్‌ ముజీబ్‌ను రక్తం వచ్చేలా గాయపరిచాయి. అదే రోజు మరో ఇద్దరు రోగులను సైతం కరిచాయి.

సానిటేషన్‌ నిర్వహణ గాలికి..
జిల్లా కేంద్ర ఆస్పత్రి భవనంలో 28 విభాగాలున్నాయి. దీంతోపాటు మెడికల్‌ కళాశాల సైతం ఇందులోనే ఏర్పాటు చేశారు. దీంతో భవనం ఇరుకుగా మారింది. వాహనాల పార్కింగ్‌కు స్థలం సరిపోవ డం లేదు. రోగులు, వారి బంధువులు భోజనం చే యడానికి సరైన స్థలం లేదు. దీంతో ఆస్పత్రిలోని మంచాల వద్ద, మెట్లపై, ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేసి, మిగిలిన తినుబండరాలు, వ్యర్థాలను అక్కడే పడేస్తున్నారు. దీంతో ఎలుకలు ఆహారం కో సం బయటకు వచ్చి, ఆస్పత్రి అంతా కలియ తిరు గుతున్నాయి. ఆక్సిజన్‌ పైపుల గుండా సంచరిస్తూ ఏసీలను పాడు చేస్తున్నాయి.

మంచాల వద్దకు వచ్చి రోగులను గాయపరుస్తున్నాయి. ఆస్పత్రి బయట ప్రాంతంలో, కిచెన్‌ షెడ్‌లో ఎక్కడ చూసినా ఎలుకల బొరియలే కనిపిస్తాయి. సానిటేషన్‌ నిర్వహణ సరి గా లేకపోవడంతో ఎలుకల స్వైర విహారానికి అడ్డుకట్ట పడడం లేదు. ఎలుకల కోసం గమ్‌ ప్యాడ్‌లు, బోనులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, వాటి బెడద తప్పించడానికి సరైన చ ర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎలుకల నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరమ్మతులు చేయిస్తాం
భవన నిర్మాణ పనులు జరగడం, రోగులు, వారి బంధువులు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేసి వ్యర్థాలను పడేస్తుండడంతో ఎలుకలు వస్తున్నాయి. ఎలుకలు రాకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైనచోట మరమ్మతులు చేయించి, ఎలుకలు రాకుండా చూస్తాం.
– విజయలక్ష్మి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, కామారెడ్డి

పరామర్శించిన బర్రెలక్క
బర్రెలక్క అలియాస్‌ శిరీష ఆదివారం జిల్లా ఆస్పత్రిని సందర్శించి, ఎలుక కరిచిన రోగిని పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విజయల క్ష్మితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభు త్వం తక్షణమే స్పందించి ఆస్పత్రిలో నెలకొన్న స మస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement