జెడ్పీ ప్రత్యేకాధికారిగా హరేంధిరప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ ప్రత్యేకాధికారిగా హరేంధిరప్రసాద్‌

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

బోట్‌క్లబ్‌(కాకినాడసిటీ): నూతనంగా ఏర్పడిన కాకినాడ జిల్లా పరిషత్‌ ప్రత్యేకాధికారిగా శనివారం కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ని జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో శ్రీ లలిత సత్కరించారు.

ముంపు ప్రాంతాల్లో

కలెక్టర్‌ పర్యటన

కాకినాడ రూరల్‌: భారీ వర్షాల ప్రభావంతో ముంపునకు గురైన కాకినాడ రూరల్‌ పి.వెంకటాపురం, తిమ్మాపురం గ్రామాల్లో కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ శనివారం పర్యటించారు. పి.వెంకటాపురం బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలోకి పొలాలు, కాల్వలోని నీరు ప్రవేశించడంతో స్వయంగా పరిశీలించి విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలకు సెలవు ప్రకటించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో విద్యార్థినులను వారి తల్లిదండ్రులతో కలిపి ఇళ్లకు పంపించారు. తిమ్మాపురం గ్రామంలో పొంగి ప్రవహిస్తున్న ఏలేరు నవర కాల్వను పరిశీలించి రక్షణ చర్యలకు ఆదేశాలిచ్చారు. తిమ్మాపురం, పండూరు మధ్య నవర కాల్వను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆర్డీఓ మల్లిబాబు, డీఎల్‌డీఓ వాసుదేవరావు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement