పిఠాపురం: అధికారుల చొరవతో బాల్య వివాహానికి అడ్డుకట్ట పడింది. వివరాలివీ.. పిఠాపురానికి చెందిన 15 ఏళ్ల బాలికకు, గొల్లప్రోలు మండలం వన్నెపూడికి చెందిన 29 ఏళ్ల యువకుడితో బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం అధికారులకు అందింది. దీంతో, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీహెచ్ లక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్ వెంకటరావు ఆదేశాల మేరకు.. సీడీపీఓ మోకా శ్రీకళ ఆధ్వర్యాన బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి.దుర్గారాణి, ఐసీడీఎస్ అధికారులు వన్నెపూడిలోని వరుడి ఇంటికి సోమవారం చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని పరిశీలించి, బాలిక తల్లిదండ్రులు, వరుడు, రెండు కుటుంబాల సభ్యులు, గ్రామ పెద్దలతో మాట్లాడారు. బాలిక తల్లిదండ్రులు, వరుడు దగ్గరి బంధువులు కావడంతో, కట్నం లేకుండా వివాహానికి ముందుకు వచ్చారని, దీంతో, ఈ పెళ్లి చేస్తున్నామని వారు తెలిపారు. అయితే, తనకు ఇష్టం లేకుండానే ఈ వివాహం చేస్తున్నారని, తాను పదో తరగతి చదువుతున్నానని, చదువు కొనసాగించాలని కోరుకుంటున్నానని ఆ బాలిక అధికారులకు తెలిపింది. తనకు సురక్షితమైన వసతి కల్పించాలని కోరింది. దీంతో, అధికారులు ఆ బాలికతో పాటు ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. 18 సంవత్సరాల వయస్సు నిండని బాలికకు వివాహం చేయడం బాల్య వివాహ నిషేధ చట్టం–2006 ప్రకారం నేరమని స్పష్టం చేశారు. బాలిక మైనర్ కావడంతో పరిస్థితులకు అనుగుణంగా పోక్సో చట్టం–2012 నిబంధనలు కూడా వర్తించే అవకాశం ఉందని హెచ్చరించారు. బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వర్చువల్ విధానంలో హాజరు పరిచారు. కమిటీ సూచనల మేరకు తాత్కాలిక రక్షణ, వసతి కోసం ఆ బాలికను కాకినాడ వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. ఆ బాలికకు 18 ఏళ్లు పూర్తయ్యే వరకూ వివాహం చేయబోమని, చదువుకు ఆటంకం కలిగించబోమని ఇరు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని అధికారులు సూచించారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
·˘ Ð]l¯ðl²ç³NyìlÌZ
బాల్య వివాహానికి యత్నం
·˘ A«¨M>Æý‡$ÌS ^öÆý‡Ð]l™ø Ayýl$zMýSrt
·˘ Æý‡„ýS׿ MýS͵…^éÌS° MøÇ¯]l »êÍMýS
·˘ Ð]l¯ŒSÝët‹³ òÜ…rÆŠ‡MýS$ ™èlÆý‡Í…ç³#


