సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్‌లో పూణే నుంచి భువనేశ్వర్ (22881) వెళుతున్న రైలు కింద పడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తిని తమిళనాడుకు చెందిన తిరు మూతి జయప్రకాష్ (36)గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే శనివారం భార్య కార్తిక, తండ్రి తంగరాజ్, సొదరుడు శక్తివేల్ సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. వారి నుంచి రైల్వే పోలీసులు వివరాలు సేకరించి మృత దేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


