చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు
సఖినేటిపల్లి: ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ వివరాల ప్రకారం.. అంతర్వేది రాంబాగ్ వద్ద శనివారం సఖినేటిపల్లికి చెందిన ఓ స్కూల్ బస్సు ప్రధాన రహదారి మార్జిన్‌లో కొబ్బరి చెట్టును ఢీకొంది. ఆ సమయంలో బస్సులో 8 మంది విద్యార్థులు ఉండగా, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సును డ్రైవర్ కాకుండా క్లీనర్ డ్రైవ్ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గాయాలైన విద్యార్థులను సమీప ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు


