రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సామర్లకోట: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి సమయంలో తన స్నేహితుడి మోటారు సైకిల్‌పై వెనుక కూర్చుని వస్తున్న సామర్లకోట బలుసులపేటకు చెందిన పోతుల ఆకాష్ (21) ప్రమాదవశాత్తూ కింద పడ్డాడు. గుమెళ్ల భాస్కరరావు ఆస్పత్రి వద్ద ఉన్న డ్రైనులో పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయి. అతన్ని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. దాంతో బలుసులపేటలో విషాదం నెలకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


