రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఇద్దరికి గాయాలు
సఖినేటిపల్లి: అంతర్వేది దేవస్థానం గ్రామ పరిధిలో బుంగవారి పేటలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కొత్తపేట పరిధి పలివెల ప్రాంతానికి చెందిన గుమ్మడి రామకృష్ణ (32), నక్కా కిషోర్, ఇంజేటి కిరణ్‌లు పల్సర్ బైక్‌పై అంతర్వేది తీర్థానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో బుంగావారి పేటలో రోడ్డు పక్కన వీధిదీపాలు లేకపోవడం, ఎదురుగా వస్తున్న ఆవును గుర్తించలేక సడెన్ బ్రేక్ వేశారు. బైక్ అదుపుతప్పడంతో ముగ్గురూ పడిపోయారు. ఈ ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. నక్కా కిషోర్ తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్పల్ప గాయాలతో కిరణ్ బయటపడ్డాడు. ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం గాయాలైన ఇద్దరిని రాజోలు ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ప్రమాదంలో మృతి చెందిన రామకృష్ణ


