● కనులవిందుగా.. | - | Sakshi
Sakshi News home page

● కనులవిందుగా..

Jan 17 2026 7:31 AM | Updated on Jan 17 2026 7:31 AM

● కను

● కనులవిందుగా..

పసందైన వంటకంబు

తిథి మర్యాదలకు గోదారోళ్లకు పేరుంది. దీనిని నిలబెట్టేలా పెరవలిలో కొత్త అల్లుడికి 220 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేయటం ఆకట్టుకుంది. పెరవలికి చెందిన ఆగర్తి వెంకట కృష్ణారావు, స్వరూపారాణి దంపతుల కుమార్తె భాగ్యశ్రీ లక్ష్మికి హైదరాబాద్‌కు చెందిన బొడ్డు భార్గవ్‌సాయితో ఐదు నెలల కిందట పెళ్లి జరిగింది. పండగకు అత్తింటికి వచ్చిర భార్గవ్‌సాయికి మకర సంక్రాంతి రోజున ఇలా వడ్డించారు. తానెప్పుడూ ఇన్ని వంటలు చూడలేదని, పేర్లు కూడా వినలేదని ఆయన ఆఽశ్చర్యంగా చెప్పారు.

– పెరవలి

పొట్టిగిత్త బండి.. అదిరిందండి

సంక్రాంతి అంటేనే రైతు పండగ. తొలకరి పంట చేతికి అందిన తర్వాత రైతులు చేసుకునే పెద్ద పండగ ఇదే. కనుమ పండగ సందర్భంగా కొమరగిరిపట్నంలో రైతు మెట్ల చినకాపు పొట్టి గిత్తల బండికి పూజ నిర్వహించి శుక్రవారం ఊరేగించారు. ప్రస్తుతం కాడెద్దులు మచ్చుకై నా లేని తరుణంలో పొట్టిగిత్తలతో ఊరేగింపు నిర్వహించడం ఆశ్చర్యపరిచింది. సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోతున్న తరుణంలో ఇలాంటి దృశ్యాలే మళ్లీ జీవం పోస్తాయి.

– అల్లవరం

ప్రత్తిపాడు రూరల్‌ మండలం రాచపల్లి అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామివారి క్షేత్రంలో బసవేశ్వరునికి విశేష అలంకరణ ఆకట్టుకుంది. సంక్రాంతి పండగల నేపథ్యంలో వివిధ రకాల పిండి వంటలతో స్వామివారిని అలంకరించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి, అలంకరణ తిలకించి మంత్రముగ్ధులయ్యారు.

– ప్రత్తిపాడు రూరల్‌

● కనులవిందుగా.. 1
1/2

● కనులవిందుగా..

● కనులవిందుగా.. 2
2/2

● కనులవిందుగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement