● చాతుర్యానిదే పైచేయి..!
బాల్ గుండాట
చక్రం గుండాట
ఐ.పోలవరం: పాచికలాట సహజంగా అందరూ ఆడేదే. భారత కాలంలో పాచికలాటంటే ధర్మరాజుకు చాలా ఇష్టం. దానిని ఆసరా చేసుకుని అతని మేనమామ తన మాయా పాచికలతో అతని సర్వస్వాన్ని గెలిచి కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాడు. నాడు ఆ ఒక్క మాయా ద్యూతానికే కురువంశం నాశనమైంది. వర్తమానానికి వస్తే అటువంటి మాయా ద్యూతాలెన్నో. ప్రత్యేకించి సంక్రాంతి మూడు రోజుల్లో కోడి పందేలు, గుండాట, బాల్ గుండాట, చక్రం గుండాట వంటి జూదాలలో రూ.వందల నుంచి రూ.లక్షల వరకు పోగొట్టుకునే వారెందరో. వీటిలో కోడి పందేలది అగ్రస్థానం కాగా, ఆ తరువాత గుండాట. వీటితో పాటు మురమళ్ల, ఎస్.యానాం వంటి భారీ బరులు వద్ద జూదగాళ్లను ఆకర్షించేందుకు బాల్ గుండాట, చక్రం గుండాటలను కూడా నిర్వహించారు. వీటిలో డబ్బు పెట్టి ఎందరో రూ.లక్షలు పోగొట్టుకున్నారు.
● చాతుర్యానిదే పైచేయి..!


