పార్టీ బలోపేతానికి చురుకై న పాత్ర
● కార్యకర్తలకు వెన్నంటి నిలవండి
● ముద్రగడకు జగన్ సూచన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నేతలందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు చురుకై న పాత్ర పోషించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు సూచించారు. గతేడాది అస్వస్థకు గురైన ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. అస్వస్థతకు గురై కాకినాడలో చికిత్స పొందుతోన్న ముద్రగడను మెరుగైన వైద్యం కోసం అప్పటి కప్పుడు ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అప్పట్లో ముద్రగడ ఎయిర్ అ ంబులెన్స్‌ను వ్యక్తిగత కారణాలతో సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇటు కాకినాడ, అటు హైదరాబాద్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న సందర్భంలో ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాన్ని తెలుసుకుంటూ ఎంతగానో తోడ్పాటు అందించారని, రుణం తీర్చుకోలేనిదంటూ జగన్‌మోహన్‌రెడ్డికి ముద్రగడ కృతజ్ఞతలు తెలియచేశారు. ఇందుకోసమై ముద్రగడ తాడేపల్లిలో బుధవారం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, పీఏసీ సమావేశాలకు హాజరు కావాలని ముద్రగడకు జగన్ సూచించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని పార్టీ ప్రత్తిపాడు కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును జగన్ ఆదేశించారు. ముద్రగడతోపాటు వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ కాకినాడ జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు గౌతు స్వామి, సీనియర్ నేత తోట రామకృష్ణ పార్టీ అధినేత జగన్‌ను కలిశారు.


