ఉత్సాహ భరితంగా క్రీడాపోటీలు
బోట్‌క్లబ్: ఐదు రోజుల నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే ఇనిస్టిట్యూట్ కాకినాడ టౌన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు హోరా హోరీగా ఉత్సాహంగా భరితంగా సాగుతున్నాయి. పోటీల్లో భాగంగా గురువారం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో బీ నాయుడుబాబు విజేతగా నిలిచారు. బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల్లో సీహెచ్‌ఎన్ ప్రేమసాగర్, కె.వెంకటేశులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా రైల్వే ఇనిస్టిట్యూట్ సెక్రటరీ పీబీ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఏటా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
బ్యాడ్మింటన్ సింగిల్స్ 36 టీమ్‌లు, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో 26 టీములు పోటీ పడుతున్నాయన్నారు. శుక్రవారం నుంచి క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ కూడా ప్రారంభమవుతాన్నారు. క్యారమ్స్‌కు 26 టీమలు, చెస్‌లో 82 మంది పోటీ పడతారన్నారు. ఈ పోటీలు ఈనెల 11వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. విజేతలకు ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున బహుమతులు అందజేస్తామన్నారు. జాయింట్ సెక్రటరీ సీహెచ్ రవిచంద్ర, కోశాధికాధికారి వీరాంజనేయులు పాల్గొన్నారు.


