టెట్‌ నిబంధన సరికాదు | - | Sakshi
Sakshi News home page

టెట్‌ నిబంధన సరికాదు

Nov 5 2025 8:09 AM | Updated on Nov 5 2025 8:09 AM

టెట్‌

టెట్‌ నిబంధన సరికాదు

డీఎస్సీ అమలు చేసిన నాటి నుంచి కాకుండా మధ్యలో ఇలాంటి నిబంధన తెర పైకి తీసుకురావడం సరైంది కాదు. దీనివల్ల నాటి ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. 20 నుంచి 30 ఏళ్లుగా ఒకే కేడర్‌లో పని చేసి, చివరి దశలో ఉద్యోగోన్నతి వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న సీనియర్‌ టీచర్ల ఆశలపై నీళ్లు జల్లే ప్రయత్నమే ఇది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి టీచర్లకు న్యాయం చేయాలి.

– ఎన్‌ఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు,

ఎస్‌టీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు

రద్దు చేయాలి

ఉద్యోగోన్నతులకు తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణత ఉండాలనే నిబంధన సరి కాదు. కూటమి ప్రభుత్వం టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తే చాలా మంది సీనియర్‌ టీచర్లకు అన్యాయం జరుగుతుంది. టెట్‌ రాయాలంటే 45 ఏళ్లలోపు ఉండాలన్న నిబంధన ఉంది. సర్వీసులో ఉన్న చాలా మంది టీచర్లు ఉద్యోగ విరమణకు సైతం సమీపంలో ఉన్నారు. ఈ వయస్సులో అలాంటి వారు టెట్‌ రాసి అర్హత సాధించడం ఎలాగని ప్రశ్నిస్తున్నాం. టెట్‌ నిబంధనను రద్దు చేయాలి.

– కుసుమంచి కాశీ విశ్వనాథ్‌,

ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వం దృష్టి సారించాలి

ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. 2010 కంటే ముందు టీచర్లుగా నియమితులైన వారు టెట్‌ ఉత్తీర్ణత సాధించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్పందించి, న్యాయం చేయాలి. రెండు మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న టీచర్లు వృత్తిపరంగా ఎప్పటికప్పుడు అనేక శిక్షణలు పొందుతూనే ఉన్నారు. అందువల్ల టెట్‌ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన సరైంది కాదు.

– ఎం.శ్రీనివాస్‌, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

తాత్కాలిక మినహాయింపు ఇవ్వొచ్చు

విద్యాహక్కు చట్టం సెక్షన్‌–23(2) ప్రకారం టెట్‌ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చే వెసులుబాటు ఉంది. ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌ కంటే ముందు జారీ చేసిన డీఎస్సీలలో నియమించిన వారు సర్వీసులో కొనసాగడానికి, ఉద్యోగోన్నతి పొందడానికి మినహాయింపు ఇవ్వాలి. సుప్రీం తీర్పు ప్రకారం రెండేళ్లల్లో టెట్‌ ఉత్తీర్ణత సాధించడం సాధ్యం కాదు.

– బి.నూకరాజు,

పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

టెట్‌ నిబంధన సరికాదు 
1
1/3

టెట్‌ నిబంధన సరికాదు

టెట్‌ నిబంధన సరికాదు 
2
2/3

టెట్‌ నిబంధన సరికాదు

టెట్‌ నిబంధన సరికాదు 
3
3/3

టెట్‌ నిబంధన సరికాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement