ముమ్మరంగా సహాయక చర్యలు | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా సహాయక చర్యలు

Oct 29 2025 7:55 AM | Updated on Oct 29 2025 7:55 AM

ముమ్మరంగా సహాయక చర్యలు

ముమ్మరంగా సహాయక చర్యలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో తుపాను సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామని కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనేమన్నారంటే..

ఫ తాగునీటి సరఫరాకు 24 ట్యాంకర్లు వినియోగిస్తున్నాం.

ఫ ఆహార సరఫరాకు 191 మందిని, పాల సరఫరాకు ఒక సంస్థను గుర్తించి సిద్ధంగా ఉంచాం. ఇప్పటి వరకూ 21,513 ఆహార పొట్లాలు, 1,313 వాటర్‌ క్యాన్లు పంపిణీ చేశాం.

ఫ ముందు జాగ్రత్తగా 95 మంది గర్భిణులను, 1,400 మంది బాలింతలను 52 ఆస్పత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం.

ఫ విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించాం. హాస్టళ్ల నుంచి 14,499 మంది విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపించాం.

ఫ సముద్రంలో వేటలో ఉన్న బోట్లన్నింటినీ తీరానికి రప్పించాం. 4,573 బోట్లు కొట్టుకుపోకుండా ఉప్పుటేరు, క్రీక్‌ల్లో ఉంచుకోవాల్సిందిగా మత్స్యకారులకు సూచించాం.

ఫ రోడ్లు, ఇతర మౌలిక వసతులకు ఎదురయ్యే అవాంతరాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరించేందుకు 47 క్రేన్లు, 124 జనరేటర్లు, 66 ఫోర్క్‌ లిఫ్ట్‌లు, 99 ఎస్క్‌వేటర్లు, 28 రోడ్డు రోలర్లు, 26 అగ్నిమాపక శకటాలు, 4 డంపర్లు, 12 హార్వెస్టర్లను అందుబాటులో ఉంచాం.

ఫ సహాయ పునరావాస కార్యక్రమాలకు 1,602 పాఠశాల బస్సులు, 28 గూడ్స్‌ క్యారియర్లు, 907 ట్రాక్టర్లు, 3,336 ట్రైలర్లను సిద్ధంగా ఉంచాం.

ఫ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను ఎప్పటికప్పుడు చక్కదిద్దేందుకు 3 వేల స్తంభాలు, 44 క్రేన్లు, 33 ప్రైవేట్‌ వాహనాలు, 11 జేసీబీలు, 41 పోల్‌ డ్రిల్లింగ్‌ మెషీన్లు, 45 జనరేటర్లు, 55 పవర్‌ రంపాలు, 526 కండక్టర్లు, 245 ట్రాన్స్‌ఫార్మర్లు, 1,000 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచాం.

ఫ 49,269 టన్నులు ఫోర్టిఫైడ్‌ బియ్యం, 9.81 టన్నుల బెల్లం, రాగి పిండి, 296 టన్నుల పంచదార, 30,185 నూనె ప్యాకెట్లు, 10 టన్నుల ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, 12 టన్నుల టమాటాలు అందుబాటులో ఉంచాం.

ఫ ప్రమాదకరమైన రూట్లలో

44 ఆర్టీసీ బస్సులను రద్దు చేశాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement