గ్రామాల వికాసంతోనే దేశాభివృద్ధి : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

గ్రామాల వికాసంతోనే దేశాభివృద్ధి : ఎమ్మెల్యే

Nov 29 2026 1:59 PM | Updated on Nov 29 2026 1:59 PM

కేటీదొడ్డి/ మల్దకల్‌: గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి పథంలో నడుస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం కేటీదొడ్డి, నందిన్నె, కుచినెర్ల గ్రామాల్లో రూ.30 లక్షల చొప్పున, గువ్వలదిన్నెలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ గోదాంలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే నందిన్నెల్లో రూ.10 లక్షలతో మహిళా సమైక్య భవనం, కుచినెర్ల పాఠశాలలో పీఎంశ్రీ పథకం కింద రూ.48 లక్షలతో నిర్మించనున్న సైన్స్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ గది, లైబ్రరీ, వర్క్‌ షెడ్డు భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి, గిట్టుబాటు ధర వచ్చే వరకు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోదాంలు ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక బలోపేతానికి వడ్డీ లేని రుణాలు అందిస్తోందని, ప్రతి మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి పైపులైన్‌ ద్వారా నీరందిస్తా మని హామీ ఇచ్చారు. మల్దకల్‌ మండలంలోని ఉలిగేపల్లిలో రూ.20 లక్షలతో మహిళా సమాఖ్య భవనం, గ్రామ పంచాయతీ భవన ని ర్మాణ పనులను భూమి పూజ చేసి ఎమ్మెల్యే ప్రా రంభించారు. అనంతరం జ్యోతిరావు పూలే వ ర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు.

అగ్నివీర్‌ నియామకాలపై ప్రత్యేక అవగాహన

గద్వాల: భారత వైమానిక దళంలో అగ్నివీర్‌ వాయుగా చేరేందుకు యువతకు సువర్ణావకాశం లభించిందని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు డిసెంబర్‌ 6న ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంట ల వరకు గద్వాల ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 17 నుంచి 22 ఏళ్ల వయస్సుండి, ఇంటర్మీడియట్‌లో కనీసం శాతం మార్కులు, 152 సెం.మీ., ఎత్తు క లిగిన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

భూ వివాదాల

పరిష్కారానికే రీ సర్వే

మానవపాడు: భూ వివాదాల సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూముల రీ సర్వే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆర్డీఓ శ్రీనివాసవావు అన్నారు. శనివారం మండలంలోని పల్లెపాడు గ్రామ పంచాయతీ మంగంపేట శివారులో సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో అధికారులు చేపట్టిన భూముల రీ సర్వే పూర్తికాబడిన అనంతరం రైతులకు నోటీసులు జారిచేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ ప్రక్రియ ద్వారా భూ సరిహద్దులపై ఉన్న వివాదాలు తగ్గడంతోపాటు, కచ్చితమైన భూ రికార్డులు రూపొందించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ప్రజలకు భూ రికార్డుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement