గద్వాల న్యూటౌన్/ అలంపూర్ రూరల్: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కోసం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల, ప్రభుత్వ అభ్యసన, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలతోపాటు అలంపూర్‌లోని మాంటిస్సోరి స్కూల్‌లో మొత్తం నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటల వరకు విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోగా.. అరగంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. 11.30 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. మొత్తం 1,002 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 903 మంది హాజరు కాగా.. 99 మంది గైర్హాజరయ్యారు. ఆయా కేంద్రాలను పరీక్షల నిర్వహణ అధికారి శ్రీనివాసులు, వట్టెం నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ పూర్ణిమా పర్యవేక్షించారు.


