కమనీయం రాములోరి కల్యాణం.. | - | Sakshi
Sakshi News home page

కమనీయం రాములోరి కల్యాణం..

Sep 8 2026 1:23 AM | Updated on Sep 8 2026 1:23 AM

ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల కల్యాణ తంతను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను అపురూపంగా ముస్తాబు చేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణాన్ని జరిపారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని పవిత్ర కష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కనులారా తిలకించారు. కల్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వా మి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement