ఆక్రమణలపై దుమారం | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపై దుమారం

Sep 1 2026 1:01 AM | Updated on Sep 1 2026 1:01 AM

గద్వాల: ‘‘మున్సిపాలిటీలోని భీంనగర్‌లో రూ.కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారు.. ఎన్ని ముడుపులు ముట్టాయి.. అందులో మాకు ఎంత వాటా ఇస్తారు..’’ అంటూ 16వ వార్డు కౌన్సిలర్‌ రామలింగేశ్వర్‌ కామ్లీ మున్సిపల్‌ కమిషనర్‌ జానకీరాంసాగర్‌ను సూటిగా ప్రశ్నించారు. మున్సిపాలిటీకి చెందిన పదిశాతం స్థలం కబ్జాపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ.. ప్రశ్నలు సంధించారు. అదే విధంగా కౌన్సిల్‌ ఆమోదం కోసం పెట్టిన 13 అంశాల్లో రూ. 6కోట్ల వ్యయానికి సంబంధించి ఒక్కటి అయినా ప్రజా అవసరాలకు సంబంధించి ఉందా అంటూ ప్రశ్నించారు. మొత్తంగా సోమవారం జరిగిన గద్వాల మున్సిపల్‌ సమావేశం వాడీవేడిగా, రసాభాసగా సాగింది.

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల ఆగ్రహం..

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు 12వ అంశంపై నోట్‌ ఆఫ్‌ డీసెంట్‌ ఇచ్చారు. గంజి వద్ద నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ దుకాణాలకు నంబరింగ్‌ కోసం రూ. 32వేలు ఖర్చు పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ పులిపాటి వెంకటేశ్‌ నేతృత్వంలో కౌన్సిలర్లు సంటెన్న, గోపాల్‌, మోహన్‌, మంజుల సునీత, లత అసమ్మతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ సంటెన్న మాట్లాడుతూ.. 2022లో జమ్మిచేడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు గద్వాల మున్సిపాలిటీ కింద పదిశాతం స్థలంలో నివాసగృహాలు నిర్మించుకునేందుకు అనుమతులు ఎలా ఇస్తారని నిలదీశారు. మున్సిపాలిటీలో మొత్తం పైరవీకారులు, దోచుకునేవారికే అధిక ప్రాధాన్యత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారు మౌనం వహించడం బాధాకరంగా ఉందన్నారు. కౌన్సిలర్‌ పులిపాటి వెంకటేశ్‌ మాట్లాడుతూ.. తాము కౌన్సిలర్లుగా గెలుపొంది ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. అలాంటిది ఇప్పుడు రూ. 6కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చూపెట్టడం దారుణమన్నారు. ప్రజాధనం ప్రజల అవసరాలు తీర్చేందుకు ఉండాలి తప్పితే, ఇలా అప్పనంగా ఖర్చుపెట్టేందుకు ఉండరాదని హితవు పలికారు.

కన్నీళ్లను మిగిల్చిన పండుగ

సోదరులకు రాఖీ కట్టి వస్తుండగా ఓ మహిళ.. రాఖీ కట్టేందుకు వెళ్తూ మరో మహిళ రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు.

–8లో u

నోటీసులకేపరిమితమవుతారా?

భీంనగర్‌లో పదిశాతం స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని తొలగించాల్సింది పోయి.. నోటీసులు ఎందుకు ఇచ్చారని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ రామలింగేశ్వర్‌ కామ్లీతో పాటు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. గతంలో పదిశాతం స్థలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను ఎలాంటి నోటీసులు లేకుండానే జేసీబీలతో కూల్చివేశారని.. ఇప్పుడు మాత్రం వారికి నోటీసులతో ఎందుకు సరిపెడుతున్నారని ప్రశ్నించారు. నోటీసుల మూలంగానే ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లేందుకు అనుకూలంగా మారిందన్నారు. ఇందులో అధికారులకు ఎన్ని డబ్బులు ముట్టాయని.. అందులో ఎవరికెంత వాటాలు ఇస్తారని మున్సిపల్‌ కమిషనర్‌ను సూటిగా నిలదీయడంతో సభా సమావేశం మొత్తం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్‌ స్థలం కబ్జాకు గురైన విషయంపై ‘సాక్షి’లో వరుస కథనాలపై సభలో ప్రస్తావించారు. అదే విధంగా రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన పదిశాతం స్థలం అక్రమంగా పోలీసు వెల్ఫేర్‌ వారికి కేటాయించి.. అందులో పెట్రోల్‌బంకు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు.

వాడీవేడిగా గద్వాల మున్సిపల్‌ సమావేశం

పదిశాతం స్థలంలో అక్రమ నిర్మాణాలపై ముడుపుల ఆరోపణలు

‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపైపెద్దఎత్తున చర్చ

12వ అంశానికి అసమ్మతి పత్రం అందించిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement