ముగిసిన ఆరాధనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆరాధనోత్సవాలు

Sep 1 2026 1:01 AM | Updated on Sep 1 2026 1:01 AM

గద్వాలన్యూటౌన్‌: జిల్లా కేంద్రంలోని షేరెల్లీవీధి, భీనంగర్‌ రాఘవేంద్రస్వామి మఠాల్లో నిర్వహిస్తు న్న మంత్రాలయ రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారి బృందావనానికి ఫల పుష్ప, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. షెరెల్లీవీధి మఠం నుంచి గద్వాల కోటలోని శ్రీభూలక్ష్మీదేవి ఆలయం వరకు ఉత్సవమూర్తిని రథంపై ఊరేగించారు. భీంనగర్‌లోని రాఘవేంద్రస్వామి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ విచారణకర్త ప్రభాకర్‌రావు, మన్నూరు ప్రహ్లదచారి, న్యాయవాది భీంసేన్‌రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement