విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు

Sep 1 2026 1:01 AM | Updated on Sep 1 2026 1:01 AM

రాజోళి: ఐసీడీఎస్‌ సిబ్బంది తమ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని సీడీపీఓ హేమలత అన్నారు. సోమవారం రాజోళిలో అంగన్‌వాడీ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి కేంద్రంలో మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, శిశువులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో ప్రతి అంశాన్ని నమో దు చేసి, వివరాలను ఎప్పటికప్పుడు సరిచూ సుకోవాలన్నారు. పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, సర్‌ ప్రక్రియలో భాగంగా సంబంధిత అధికారులకు అందుబాటులో ఉంటూ.. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు.

ప్రజా సమస్యలను

పరిష్కరించండి

గద్వాల: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో నర్సింగ్‌ కాలేజీ, వసతిగృహం, బాలసదన్‌ ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహంలో మరుగుదొడ్ల సమస్య తీర్చాలని, శిథిలావస్థలో ఉన్న బీసీ బాలబాలికల వసతిగృహాలకు కొత్త భవనాలు నిర్మించాలని కోరారు. అలాగే పుటాన్‌దొడ్డి, గుర్రంగడ్డ గ్రామాల్లో పాఠశాలలను ప్రారంభించాలని, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలకు సొంత భవనం నిర్మించాలని, జిల్లా ఆస్పత్రిలో వైద్య పరికరాలను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో రోగుల చావులకు కారణమవుతున్న వైద్యులను బదిలీ చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పేరు నర్సింహ, బాలకృష్ణ, వీరేశ్‌, నర్సింహ, ఎల్లప్ప, చంద్రుడు, మహేశ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

పల్లీ క్వింటా రూ.7,709

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్‌యార్డుకు సోమవారం 210 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ.7,709, కనిష్టంగా రూ. 5,369, సరాసరి రూ.6769 ధరలు పలికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement