జోగుళాంబ సన్నిధిలో మంత్రి పూజలు.. | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ సన్నిధిలో మంత్రి పూజలు..

Sep 1 2026 1:01 AM | Updated on Sep 1 2026 1:01 AM

లంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం రాత్రి హరిత టూరిజంలో బసచేసిన ఆయన.. సోమవారం ఉదయం ఎంపీ డీకే అరుణతో కలిసి ఆలయాలను దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరస్వామికి అభిషేకాలు, జోగుళాంబ సన్నిధిలో కుంకుమార్చనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఓ పురేందర్‌కుమార్‌, ఏఎస్పీ శంకర్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, వైస్‌చైర్మన్‌ శంకర్‌, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్‌ ప్రసాద్‌, రాంచంద్రారెడ్డి, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement