క్రీడలతో మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక ఉల్లాసం

Sep 1 2026 1:01 AM | Updated on Sep 1 2026 1:01 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: టీచర్స్‌ డేను పురస్కరించుకుని పాలమూరు యూనివర్సిటీలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. పీయూ వీసీ శ్రీనివాస్‌ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, పీడీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

రీసెర్చ్‌ సూపర్‌వైజర్‌గా వెంకట్‌రెడ్డి..

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పరిశోధన అంశాల పర్యవేక్షణకు గద్వాల్‌ పీజీ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ వెంకట్‌రెడ్డిని రీసెర్చ్‌ సూపర్‌వైజర్‌గా నియమిస్తూ వీసీ శ్రీనివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement