బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
గద్వాల: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివా హాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాల ని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31వ తేదీ వర కు చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమంలో 77 మంది బాలల ను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపా రు. 2019 నుంచి 2025 వరకు జిల్లావ్యాప్తంగా 2,323 మంది పిల్లలను రక్షించి.. వారికి పునరావా సం, విద్య ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన ట్లు వివరించారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికు లు ఉన్నా, బాల్యవివాహానికి యత్నించినా వెంటనే డయల్ 100 లేదా 1098 నంబర్లకు సమాచా రం అందించాలని ఆయన కోరారు. సమావేశంలో అద నపు కలెక్టర్లు నర్సింగ్‌రావు, శంకర్, జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి సునంద, డీఈఓ విజయలక్ష్మి ఉన్నారు.
● ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని.. హాల్‌టికెట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావొద్దన్నారు. ఎవరైనా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడికే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


