రుణ లక్ష్యం.. రూ.1200 కోట్లు
యాసంగి పంట రుణ లక్ష్యం ఖరారు
బ్యాంకు రైతుల రుణలక్ష్యం
సంఖ్య
ఎస్‌బీఐ 14,926 304.16
గ్రామీణ బ్యాంక్ 7,397 150.71
యూబీఐ 8,743 178.17
కెనరా బ్యాంక్ 6,952 141.96
ఇండియన్ బ్యాంక్ 6,020 122.49
హెచ్‌డీఎఫ్‌సీ 5,448 111.40
ఐసీఐసీఐ 3,719 75.97
టీఎస్ కోఆపరేటివ్ 2,181 44.03
సెంట్రల్ బ్యాంక్ 1,989 40.25
యాక్సిస్ 925 19.08
బ్యాంక్ ఆఫ్ బరోడా 179 4.13
కరూర్ వైశ్య బ్యాంక్ 185 3.40
కేబీఎస్ 105 2.26
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 93 1.73
బ్యాంక్ ఆఫ్ ఇండియా 31 0.45
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9 0.13
గద్వాలన్యూటౌన్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యాసంగి పంట రుణ లక్ష్యం ఖరారు అయ్యింది. నడిగడ్డలో యాసంగి పంటలకు గాను 58,902 మంది రైతులకు రూ. 1200.58 కోట్లు రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్దేశితమైంది. పంట పెట్టుబడులకి ఇక్కడి రైతులు బ్యాంకులు అందించే రుణాలపైనే అధారపడ్డారు. బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోథల పథకం, దీని కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. ఏటా రెండు సీజన్‌లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఇంకా పండ్లతోటలు, కూరగాయలు పండిస్తున్నారు. జిల్లాలో తొంభైశాతం సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు.
జిల్లా వివరాలిలా.. (రూ.కోట్లలో)
(09జిడియల్203–210034)
పంట రుణాలపైనే రైతుల పెట్టుబడి ఆశలు
వానాకాలం సీజన్‌లో 61 శాతం రుణ లక్ష్యం చేరిన వైనం
బ్యాంకర్లు సకాలంలో అందిస్తేనే ప్రయోజనం
అర్హులందరికీ పంట రుణాలు
పంట పెట్టుబడుల్లో బాగంగా పంట రుణాలఉక ధరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరికి రుణాలు అందిస్తాం. రుణాలు పొందాలనుకున్న రైతులు తప్పక రెన్యూవల్ చేసుకోవాలి. దీనివల్ల రుణాలు అందించడానికి వీలు అవుతుంది. యాసంగి సీజన్‌లో లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాసరావ్, ఎల్‌డీఎం
రుణ లక్ష్యం.. రూ.1200 కోట్లు


