శివాలయ పునర్నిర్మాణానికి రూ.3.5లక్షలు విరాళం
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని నల్లకుంట శివాలయ పునర్నిర్మాణం కోసం భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించే శివాలయ పునర్నిర్మాణంలో కాలనీ ప్రజలతో పాటు సమీప కాలనీల భక్తులు భాగస్వామ్యం అవుతున్నారు. ఆ దిశగా ఆలయ కమిటీ సభ్యులు దాతల నుంచి విరాళాలను సేకరిస్తున్నారు. ఆదివారం ప్రముఖ సీడ్ ఆర్గనైజర్ మేకలసోంపల్లి ప్రభాకర్‌రెడ్డి రూ.3,51,116ను విరాళంగా అందజేశారు. వీరితో పాటు మరికొందరు అలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వహకులు పులిపాటి వెంకటేష్, వెంకట్రాములు, గోపాల్, నల్లారెడ్డి, రాంరెడ్డి, సోనీ వెంకటేష్, బాలాజీ, అల్లంపల్లి వెంకటేష్, రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కనులపండువగా అయ్యప్ప మహా పడిపూజ
గద్వాలటౌన్: శరణం.. శరణం అయ్యప్పా.. అంటూ జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి నామస్మరణం, శరణు గోషతో మార్మోగాయి. ఆదివారం ఉదయం స్థానిక వెంకటరమణ కాలనీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ వేసుకున్న అయ్యప్పస్వాములతో పాటు మహిళలు, ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అయ్యప్ప సేవలో తరించారు. అయ్యప్ప మాలాధారులు భక్తి పారవశంలో మునిగిపోయారు. ఈ సందర్బంగా నిర్వహించిన మహా పడిపూజ కనులపండువగా సాగింది. మహా పడిపూజ కార్యక్రమంలో భక్తులు శరణుఘోష దీక్షాధారులనే కాక, ఇతర భక్తులను పారవశ్యంలో ముంచెత్తింది. అయ్యప్పస్వామిని, మెట్లు తదితర వాటిని వైభవంగా అలంకరించారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి, పోతుల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
(09జీడీయల్103


