రైతులకు నష్టపరిహారంఅందించాలి
ఎర్రవల్లి: ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు మణికుమార్, బుచ్చన్న, మోషే, రామకృష్ణ ఉన్నారు.


