ఏర్పాట్లు చేస్తున్నాం..
వానాకాలంలో పండించిన ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నాం. ఇందుకు అనుగుణంగా 84 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తాం. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా అక్రమాలకు పాల్పడిన రైస్‌మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆర్‌ఆర్ యాక్టు కింద రికవరీ చేస్తాం.
– వి.లక్ష్మీనారాయణ, అదపు కలెక్టర్


