‘గుడ్‌విల్‌’తో గాలం | - | Sakshi
Sakshi News home page

‘గుడ్‌విల్‌’తో గాలం

Nov 5 2025 8:01 AM | Updated on Nov 5 2025 8:01 AM

‘గుడ్‌విల్‌’తో గాలం

‘గుడ్‌విల్‌’తో గాలం

వైన్స్‌లను దక్కించుకునేందుకురంగంలోకి లిక్కర్‌ వ్యాపారులు

రూ.లక్షల్లో మొదలైన బేరసారాలు

అచ్చంపేట/గద్వాల క్రైం: మద్యం దుకాణాల కేటాయింపు పూర్తికావడంతో.. వాప్యారుల బేరసారాలు మొదలయ్యాయి. నజరానా ఇస్తాం.. దుకాణం ఇస్తారా.. అంటూ లక్కీడ్రాలో మద్యం దుకాణం దక్కిన వారిని వ్యాపారులు ప్రలోభపెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి నజరానా ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే లక్కీ డ్రాలో దుకాణం దక్కించుకున్న వారంతా మంగళవారం ఆయా దుకాణాలకు రెంటల్‌ రేటు ఆధారంగా 1/6వ వంతు డబ్బులు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. టెండర్ల ప్రక్రియ ముగియడంతో డిసెంబరు 1 నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో సిండికేట్‌ వ్యాపారులకు దక్కని మద్యం దుకాణాలపై కన్నేశారు. పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని బడా, పాత లిక్కర్‌ వ్యాపారుల యోచిస్తున్నారు. గుడ్‌విల్‌ ద్వారా ఆ దుకాణాలను చేజిక్కించుకుని మద్యం వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

సిండికేట్‌ కోసం..

మద్యం దుకాణాలకు టెండర్లు ముగిశాయి. లక్కీడ్రాలో జిల్లాలోని 34 దుకాణాల ఎంపిక పూర్తయింది. ఇప్పుడు ఉన్న అన్ని దుకాణాల యజమానులు ఒక్కటైతేనే సిండికేట్‌గా మార్గం సులువవుతుంది. తద్వారా చీఫ్‌ లిక్కర్‌ విక్రయాలు, బెల్టుషాపులకు అధిక ధరలకు విక్రయించుకునే అవకాశాలను జోరుగా నడిపేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వ్యాపారంలో తలపండిన వారికి సిండికేట్‌, బెల్టు షాపులకు లిక్కర్‌ సరఫరా వంటివి సులువుగా చేసేస్తారు. తమకు దక్కిన దుకాణాలతోపాటు ఇతర వాటిని పొందడం ద్వారా లిక్కర్‌ వ్యాపారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు.

నిబంధనల ప్రకారం ఉంటేనే..

ప్రస్తుత మద్యం పాలసీ నవంబర్‌ 30న ముగియనుండగా 2025–27కు సంబంధించి కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభవుతాయి. అయితే మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ఎక్కడ దుకాణం ఏర్పాటు చేస్తారు.. ఏ పేరిట దుకాణం పెడతారు.. తదితర వివరాలను ఎకై ్సజ్‌ శాఖ అధికారులకు సమర్పించాలి. దుకాణం గుడి, బడి, ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలో ఉందా.. లేదా.. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేస్తున్నారా.. అనే విషయాలను అధికారులు పరిశీలించిన తర్వాత అన్నీ సవ్యంగా ఉంటేనే మద్యం దుకాణం ఏర్పాటుకు లైసెన్స్‌ జారీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement