ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం

Nov 5 2025 8:01 AM | Updated on Nov 5 2025 8:01 AM

ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం

ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం

గద్వాల: వానాకాలంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 2లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు రైతులకు అందుబాటులో 84 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, కాంటాలు, తేమ శాతం పరిశీలించే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు తదితర వాటిని అందుబాటులో ఉంచనున్నారు. కాగా, 2024–25 వానాకాలం, యాసంగి సీజన్‌లో ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన సీఎమ్మార్‌ను మిల్లర్లు పెట్టకుండా.. మరోసారి ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది వానాకాలంలో 96వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా.. యాసంగిలో లక్ష మెట్రిక్‌ టన్నులు సేకరించారు. ఇందులో వానాకాలం ధాన్యానికి సంబంధించి 83 శాతం సీఎమ్మార్‌ పెట్టగా.. యాసంగికి సంబంధించి 44 శాతం మాత్రమే సీఎమ్మార్‌ పెట్టారు. ఈ క్రమంలోనే రూ. 10కోట్ల విలువజేసే ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు.

గతేడాది కేటాయింపులు ఇలా..

2024–25 వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 96618.800 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి.. 37 రైస్‌మిల్లులకు కేటాయించారు. రైస్‌మిల్లర్లు మొత్తం 64734.248 మెట్రిక్‌ టన్నుల సీఎమ్మార్‌ పెట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 54459.234 మెట్రిక్‌ టన్నుల బియ్యం అందించారు. ఇంకా 10915.947 మెట్రిక్‌ టన్నుల బియ్యం పెట్టాల్సి ఉంది. అదే విధంగా యాసంగి సీజన్‌లో 101924.320 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి.. 39 రైస్‌మిల్లులకు కేటాయించారు. ఇందుకు సంబంధించి 68339.908 మెట్రిక్‌ టన్నుల సీఎమ్మార్‌ పెట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 30465.030 మెట్రిక్‌ టన్నుల సీఎమ్మార్‌ పెట్టారు. ఇంకా 38551.511 మెట్రిక్‌ టన్నుల సీఎమ్మార్‌ అందించాల్సి ఉంది.

రూ.10కోట్లధాన్యం బొక్కేసిన మిల్లర్లు..

ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించారు. రూ. 10కోట్లకు పైగా ధాన్యాన్ని దర్జాగా బొక్కేశారు. కేటీదొడ్డి మండలం కమ్మిడి స్వామి రైస్‌మిల్లు నిర్వాహకుడు రూ. 7.80కోట్ల విలువ గల ధాన్యాన్ని స్వాహా చేయగా.. గద్వాల సమీపంలోని శ్రీరామ రైస్‌మిల్లు యజమాని రూ. 2.25కోట్ల ధాన్యాన్ని స్వాహా చేశారు. ఆయా రైస్‌మిల్లుల్లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించి.. అక్రమార్కుల లెక్క తేల్చారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్‌ఆర్‌ యాక్టు కింద నోటీసులు జారీ చేశారు. కాగా, పెద్ద మొత్తంలో ఽప్రభుత్వ ధాన్యాన్ని మిల్లర్లు బొక్కేస్తుంటే.. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి నియంత్రించాల్సిన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కొందరు అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

2లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

జిల్లావ్యాప్తంగా 84 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు

గతేడాది యాసంగిలో తీసుకున్న ధాన్యానికి 44శాతం మాత్రమే సీఎమ్మార్‌ పెట్టిన మిల్లర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement