భూపాలపల్లి: తప్పులు లేని ఓటరు జాబితాను అందించాలనే ఉద్ధేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతీ ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాన్ని అందించి, పూర్తి వివరాలను నింపించి తీసుకొని, డిజిటలైజేషన్ చేసింది. అయినప్పటికీ అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడకగానే ఉంది. ఓటర్ల జాబితాలో పలువురు చాలామంది ఓటర్ల ఫొటోలకు బదులుగా ఆధార్‌కార్డులు, ఏకంగా ‘సర్’ ఫారాలే ముద్రించబడ్డాయి. డబుల్ ఓట్లను సైతం తొలగించలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమం వృథాయేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఏడాది, రెండేళ్ల క్రితం మృతి చెందిన వారి ఓట్లు సైతం భూపాలపల్లి నియోజకవర్గం ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నట్లు తెలిసింది.


