జిల్లాలో రోడ్డు పక్కన బావులు, పాడుబడిన గోతులు వాహనదారులకు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రోడ్డు పక్కన చెట్లు, చెత్తాచెదారంతో బావులు కనిపించకపోవడం, రాత్రివేళల్లో గుర్తుపట్టక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. గతంలో పలు ప్రమాదాలు జిల్లాలో జరిగిన ఘటనలు సైతం ఉన్నాయి. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే దారుల్లో సంబంధిత అధికారులు బావులను గుర్తించి భద్రత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. ప్రమాదకరమైన బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించడమో లేక పూడ్చివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని రహదారుల పక్కన ఉన్న ప్రమాదకరమైన బావులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.
– భూపాలపల్లి/రేగొండ/టేకుమట/మొగుళ్లపలి/మహాముత్తారం


