చిట్యాల: మండలంలోని వివిధ గ్రామాలలో రైతుల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.అశోక్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు అర్జీలు పెట్టుకున్న సాదా బైనామా, భూ భారతి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ వసంతరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
రహదారి విస్తరణకు
మంత్రి హామీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం బస్టాండ్ సమీపంలోని శ్రీపాదచౌక్ నుంచి హైస్కూల్ వరకు ప్రధాన రహదారి విస్తరణ కోసం హైదరాబాద్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్తులు కలిశా రు. రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్లవాసులు ఏకతాటిపైకి వచ్చి 24 ఫీట్ల విస్తరణకు అంగీకరించినట్లు మంత్రికి వివరించారు. నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేయడంతో ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారివెంట ధర్మకర్త సత్యనారాయణ, కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, మధు, అరుణ్, కిరణ్, బాబా, మహేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్, సతీష్, సురేష్, రంజీత్, సాయికృష్ణ ఉన్నారు.
ప్రజలను తప్పుదోవ
పట్టించడానికే..
భూపాలపల్లి రూరల్: ప్రజలను తప్పుదోవ పట్టించడానికే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం నిలిపివేస్తోందని జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బట్టు కరుణాకర్ మాట్లాడారు. పేదలకు ఉపయోగపడే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఈ ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, స్థానిక కౌన్సిలర్లు, యువజన నాయకులు పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీసీ మహిళలు కుట్టు మిషన్ల కోసం సెప్టెంబర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య తెలిపారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం అనుమతులు వచ్చిన వారు ఆలస్యం చేయకుండా ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ అర్బన్ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: పట్టణంలోని వీధి వ్యాపారులు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, కమిషనర్ ఉదయ్‌కుమార్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వీధి వ్యాపారుల కమిటీ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ సమావేశానికి హాజరై వీధి వ్యాపారులకు అందుతున్న రుణాలు, రికవరీ, సీఐజీ గ్రూపుల ఏర్పాటు, పట్టణంలో ట్రాఫి క్‌కు అంతరాయం లేకుండా వెండింగ్ జోన్ల డీ–మార్కేషన్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో సభ్యులు రాంబాబు, టీ ఎల్‌ఎఫ్ అధ్యక్షురాలు రాధ, ఎస్‌ఎల్‌ఎఫ్ అధ్యక్షురాలు స్వప్న, ఎన్‌జీఓ ప్రతినిధి శ్యామ్, మెప్మా డీఎంసీ రాజేశ్వరి, సీఓ నిర్మల పాల్గొన్నారు.


