రేగొండ: వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వర్షాలు కురవాలని వరుణయాగం నిర్వహించగా ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో కోటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షించారు. మండలంలోని లింగాల ఎంజేపీలో సుమారు రూ.3లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, ఇన్వర్టర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఆలయ మాజీ చైర్మన్ సంపత్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం రవి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


