విద్యుత్‌ లైన్‌మెన్‌ల పాత్ర గొప్పుది | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ లైన్‌మెన్‌ల పాత్ర గొప్పుది

Mar 5 2026 7:39 AM | Updated on Mar 5 2026 7:39 AM

చిట్యాల: విద్యుత్‌ సరఫరాలో లైన్‌మెన్‌ ఉద్యోగుల పాత్ర గొప్పదని చిట్యాల విద్యుత్‌ శాఖ ఏడీఈ సుందర్‌కుమార్‌ అన్నారు. జాతీయ లైన్‌మన్‌ దివాస్‌ కార్యక్రమాన్ని బుధవారం మండలకేంద్రంలోని విద్యుత్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఉత్తమ సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన లైన్‌మెన్‌లకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈ చంద్రశేఖర్‌, విద్యుత్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

యూత్‌ పార్లమెంట్‌

జిల్లా స్థాయి పోటీలు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలో ఈ నెల 7వ తేదీన వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించున్నట్లు మై భారత్‌ జిల్లా అధికారి సీహెచ్‌ అన్వేష్‌ బుధవా రం ప్రకటనలో పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ 50 ఏళ్ల ఎమర్జెన్సీ, భారతీయ ప్రజాస్వామ్యానికి పాఠాలు అనే అంశంపై 3 నిమిషాల ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల వ య స్సు కలిగిన అభ్యర్థులు ఈనెల 7న ఉదయం 10 గంటలకు స్థానిక సంఘమిత్ర డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలకు రావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు మైభారత్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

రోడ్డు నియమాలు

పాటించాలి

మల్హర్‌(కాటారం): వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. ఆరైవ్‌.. ఆలైవ్‌ రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా బుధవారం డీఎస్పీ ఆధ్వర్యంలో 150 మంది ఆటోడ్రైవర్లు, లారీ డ్రైవర్లకు కాటారం సెంటర్‌లో ఐ చెకప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతిఒక్కరూ ట్రాఫిక్‌ నియమాలను పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్ట్‌ వినియోగం అలవాటు చేసుకోవాలన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement