ఎప్పుడూ తాళమే..
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
భూపాలపల్లి–పరకాల జాతీయ రహదారికి ఆనుకొని పట్టణ శివారులో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్కును ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పూర్తిగా అడవినే పార్కుగా మార్చి రోడ్లు వేసి ఓపెన్ జిమ్, ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. జిమ్‌తో పాటు ఆట పరికరాలు కూడా చెడిపోయి నిరుపయోగంగా మారాయి. కానీ ఈ పార్కు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల మాత్రమే తెరిచి ఉంటుంది. ఇంట్లో నుంచి పిల్లలను ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదం కోసం పార్కుకు వెళ్దామన్నా పోలేని పరిస్థితి దాపురించింది. పార్కును అభివృద్ధి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు చెప్పినా ఇప్పటి వరకు ఆచరణలోకి రావడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా పార్కు తెరిచి ఉండే విధంగా చూడాలని పలువురు పట్టణ ప్రజలు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
ఎప్పుడూ తాళమే..


