కొనసాగుతున్న నిరసన | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న నిరసన

Jun 15 2024 2:04 AM | Updated on Jun 15 2024 2:04 AM

కొనసా

కొనసాగుతున్న నిరసన

భూపాలపల్లి అర్బన్‌: భాస్కరగడ్డ సమీపంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వద్ద లబ్ధిదారుల నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. మూడు రోజులుగా లబ్ధిదారులు టెంట్‌ వేసుకొని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇళ్లను 8 నెలల నుంచి లబ్ధిదారులకు ఇవ్వకుండా కలెక్టర్‌, అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్లు కేటాయించే వరకు నిరసన, దీక్ష కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌ బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడారు. జూలై 1వ తేదీలోపు ఇళ్లు కేటాయిస్తామని కలెక్టర్‌ హమీ ఇచ్చినట్లు తెలిపారు.

‘ప్రైవేట్‌కు అప్పగించడం సరికాదు’

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గనిలో సీమ్‌లను ప్రైవేట్‌ కాంట్రాక్ట్‌కు అప్పగించడం సరికాదని.. దానిని అడ్డుకుంటామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ తెలిపారు. గని ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌కు రాజ్‌కుమార్‌ హాజరై మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన అనతికాలంలో కార్మికుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కార్మికులకు 35శాతం లాభాల వాటా ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 8గనిలో 2 సీమ్‌లను యాజమాన్యం ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. దీనిని తిప్పికొట్టేందుకు పోరాటాలు చేసేందుకు ఏఐటీయూసీ సిద్ధంగా ఉందని కార్మికులు మద్దతు తెలిపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్‌, రాంచందర్‌, కృష్ణారెడ్డి తెలిపారు.

ఉపాధి కూలీల ధర్నా

మహాముత్తారం: కూలి గిట్టుబాటు కావడం లేదని ఉపాధి హామీ కూలీలు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మహాముత్తారం మండలకేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీలు గ్రామపంచాయతీ పరిధిలోని పాలెంకుంటలో నాలుగు వారాలనుంచి పనులు చేస్తున్నారు. రోజుకు కూలి కేవలం రూ.50 మాత్రమే రావడంతో శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం కూలీలు మాట్లాడుతూ పనిచేసే చోట కనీస అవసరాలు లేకపోవడమే కాక తాగునీరు కూడా అందుబాటులో ఉంచడంలేదని కూలీలు ఆరోపించారు. ప్రథమ చికిత్స పెట్టె కూడా అందుబాటులో ఉంచడం లేదని చెప్పారు. ఫీల్డ్‌అసిస్టెంట్‌ పర్యవేక్షణ లేదని ఆరోపించారు.

‘కాళేశ్వరం’ సరిహద్దుల్లో పోలీసుల అలర్ట్‌

కాళేశ్వరం: ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన చెక్‌పోస్ట్‌ వద్ద కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఇరురాష్ట్రాల నుంచి రాకపోకలు కొనసాగిస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీచేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులను విచారించి వదిలేశారు. ‘సమాచారం మాకు–బహుమతి మీకు’ అనే మావోయిస్టుల ఫొటోలతో కూడిన కరపత్రాలను ప్రయాణికులకు చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఫొటోలోని మావోయిస్టులు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి గోదావరి తీర ప్రాంతాల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించారనే అనుమానంతో నిఘాను తీవ్రతరం చేశారు. మావోయిస్టుల సమాచారం తెలియజేస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, నగదు బహుమతి అందజేస్తామని ఎస్సై భవానీసేన్‌ పేర్కొన్నారు.

19న జాబ్‌మేళా

ములుగు రూరల్‌: నిరుద్యోగ యువతీ, యువకులు ఈ నెల 19 తేదీన నిర్వహించనున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్‌ మేళాలో 58 కంపెనీలు పాల్గొంటున్నాయని, 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంచర్ల పంచాయతీ ఎంఆర్‌ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

కొనసాగుతున్న నిరసన
1
1/2

కొనసాగుతున్న నిరసన

కొనసాగుతున్న నిరసన
2
2/2

కొనసాగుతున్న నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement