జనగామ రూరల్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొదిస్తూ, సామాజంలోని మూఢ విశ్వాసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న జనవిజ్ఞాన వేదిక కృషి అభినందనీయమని డీసీపీ రాజామహేంద్ర నాయక్ అన్నారు. శనివారం జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు రసాల బాలరాజు అధ్యక్షతన జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు బాలరాజు అధ్యక్షతన ఏకశిలా డీఈడీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ పాఠశాలల విభాగం నుంచిఽ పీఎంశ్రీ పాఠశాల(ధర్మకంచ), రెసిడెన్షియల్ విభాగం లింగాలఘనపూర్ మోడల్ పాఠశాల, ప్రైవేట్ విభాగం నుంచి జనగామ ఏకశిలా పబ్లిక్ స్కూల్ ఎన్నికయ్యాయి. డాక్టర్ భిక్షపతి, ఏకశిలా స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్‌రెడ్డి, ఏకశిలా బీఈడీ ప్రిన్సిపాల్ మార్రెడ్డి, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


