● కలెక్టర్ సంందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్లో పీఎంశ్రీ పాఠశాలలకు మ్యాథ్స్, సైన్న్స్ కిట్లు, కేజీబీవీ పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు పంపిణీ చేశారు. జిల్లాలోని 15 పీఎంశ్రీ పాఠశాలలకు ఒక్కొక్క పాఠశాలకు 15 మ్యాథ్స్ కిట్లు, 3 సైన్న్స్ కిట్ల చొప్పున ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. కేజీబీవీ రఘునాథపల్లి పాఠశాలకు 6 కంప్యూటర్లు, చిల్పూర్ 7 కంప్యూటర్లు, తరిగొప్పుల 7 కంప్యూటర్లను, జిల్లా పరిషత్ సీఈఓకు 6 ప్రింటర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బాలరామ రావు, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, హెచ్ఎంలు పాల్గొన్నారు.


