జనగామ రూరల్: జాతీయ లోక్ ఆదాలత్లో అవకాశమున్న కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో జడ్జి ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో పోలీస్ అధికారులతో సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి శంకర శ్రీదేవి పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సందీప, ఏసీపీలు నర్సయ్య, ఆర్.భీమ్ శర్మ, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


